కేటీఆర్‌ పాయె..శ్రీధర్‌ బాబు వచ్చె!

KTR left.. Sridhar Babu came!– తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం
– అధ్యక్షుడిగా ఐటీ శాఖ మంత్రి
నవతెలంగాణ – హైదరాబాద్‌
తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం నూతన అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఉపాధ్యక్షులు పుల్లెల గోపీచంద్‌ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఓ సమావేశంలో ప్రకటించారు. ఐటీ శాఖ మాజీ మంత్రి కె. తారక రామారావు పదవీ కాలం 2026 వరకు ఉన్నప్పటికీ.. అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయన అనూహ్యంగా తప్పుకున్నారు. నూతన అధ్యక్షుడు శ్రీధర్‌ బాబును తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం కార్యవర్గ సభ్యులు సన్మానించారు. ‘ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ది పట్ల చిత్తశుద్దితో పని చేస్తోంది. ఒలింపిక్స్‌లో పతకాల సాధనే లక్ష్యంగా స్పోర్ట్స్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకు ప్రయత్నం చేస్తామని’ శ్రీధర్‌ బాబు తెలిపారు.