గాంధారి మండలంలోని గౌరారం కలాం ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి శ్రీహరి ఆధ్వర్యంలో ప్రపంచ బ్రేలీ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా లూయిస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీహరి మాట్లాడుతూ లూయిస్ నిరుపేద కుటుంబంలో పుట్టి వీధి వక్రీకరించి కంటికి గాయమై నాలుగేళ్లకే కంటిచూపు పోగొట్టుకున్నారని అన్నారు. అందమైన లోకాన్ని తానిక చూడలేనని కులిమిపోకుండా తాను చదువుకుంటూ అందులకు వెలుగులు నింపాలనే సంకల్పంతో బ్రెయిలీని 1819లో లూయిస్ నెపోలియన్ ఆర్మీ కోసం రూపొందించిన నైట్ రైటింగ్ సిస్టంను గురించి తెలిసి దాని ఆధారంగా 1824లో 6 పాయింట్ల నుండి వివిధ సమీకరణాల ద్వారా అక్షరాలు, అంకెలు మరియు ఇతర చిహ్నాలను సృష్టించాడు. ఈ పద్ధతి అందులకు తాము చదవగలగడం, రచన చేయగలగడం అనే స్వేచ్ఛను అందించాయని యం ఇ ఓ శ్రీహరి తెలిపారు. అందులకు ఆత్మస్థైర్యం నింపిన లూయిస్ బ్రెయిలీ జీవిత కథ అందుల కోసం మాత్రమే కాదు సాదరణ వ్యక్తులకు కూడా పెద్ద ప్రేరణగా నిలుస్తుందని ఈ బ్రెయిలీ దినోత్సవాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని ప్రత్యేక ఉపాధ్యాయుడు ఏం. పెంటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిత, సత్యం, ఫౌజియా మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.