ఉపాధ్యాయులను సన్మానించిన తోటి ఉపాధ్యాయులు..

Fellow teachers who honored the teachers..నవతెలంగాణ – జుక్కల్ 

మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఎంపీ యుపిఎస్ పాఠశాల హెచ్ఎం జైచంద్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా టీచర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందించారు. అనంతరం హెచ్ ఎం జై చంద్ మాట్లాడుతూ.. పూర్వం మహిళలు పాఠశాలలకు వెళ్లాలంటే కట్టుబాట్లు ఉండేవని పేదలకు పాఠశాలలతో సంబంధం లేకుండా ఉండేవారని ఉన్నత వర్గాల వారే పాఠశాలలకు వెళ్లి విద్యను అభ్యసించే రోజులలో సమాజాన్ని ఎదిరించి పోరాడి సావిత్రిబాయి పూలే మహిళలకు ఆదర్శంగా నిలిచి, ఉపాధ్యాయురాలిగా పేదలకు విద్యను అందించి కృషి చేశారు ప్రతి ఒక్క మహిళ వృత్తిలో ఉన్న నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కచ్చితంగా అభ్యసించాలని కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు విద్యను అభ్ సమాజంలో అస్పృశ్యత నివారణ మహిళలకు స్వేచ్చనిచ్చినట్టు ఉంటుందని పూర్వంలోనే ఆమె మహిళలకు ఏకతాటిపై నడిపించి పోరాడిన వీర వనితనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు  ఎల్ ఎన్ గౌడ్, మధు ఉపాధ్యాయునిలు జై శ్రీ ,రుక్సానా బేగం, సాధన యామినీలను శాలువాతో  సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో బస్వాపూర్ ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.