టీఎస్ యుటిఎఫ్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే..

TS UTF Calendar was unveiled by MLA..
నవతెలంగాణ – అచ్చంపేట 
పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (టీఎస్ యుటిఎఫ్) ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ను, నూతన 2025 డైరీ  ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ  శనివారం ఆవిష్కరించారు. టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికైన అచ్చంపేట కు చెందిన ఉపాధ్యాయులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉపాధ్యాయులకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలోమున్సిపల్  చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మండల విద్యాశాఖ అధికారి జీవన్ కుమార్, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు, కొర్ర శంకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు రాములు, లలితాబాయి, బాబురావు, గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గోపాల్, మండల నాయకులు, రామకృష్ణ, స్వామీలాల్. ధన్సింగ్, శ్రీను, బీచ్య, జానకమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.