
సర్ ఐజాక్ న్యూటన్ ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్తగా,సిద్ధాంత కర్త, తత్వవేత్తగా ఈ ప్రపంచంలో అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని, సైన్స్ పితామహుడని బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి అన్నారు. శనివారం సర్ ఐ జెక్ న్యూటన్ జయంతి సందర్బంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం, అది సైన్సుగా ఎలా పరిణామం చెందినది అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారని,అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ సైన్సు పితామహుడిగా గౌరవస్తుందని అన్నారు.అలాంటి గొప్ప మహనీయున్ని మన అందరం ఎల్లప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలని తెలిపారు.