
హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహని మాజీ ఎస్ సెల్ జిల్లా అధ్యక్షులు బొమ్మల యాదగిరి, డిసిసి ప్రధాన కార్యదర్శి ఎండి షాబుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా వారితో మాట్లాడుతూ ఒక్కసారి సిద్దిపేట కు వచ్చి, గవర్నమెంట్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ కూడా సందర్శించాలని కోరినట్లు తెలిపారు. దానికి సానుకూలంగా స్పందించి అతి త్వరలో వస్తానని చెప్పడం జరిగిందని తెలిపారు.