– పర్యటన వివరాలు ప్రకటించిన పీఆర్ డీఈఈ శ్రీధర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వారావుపేట మండలంలో సోమవారం పర్యటించనున్నారు. ఒక్కోటి రూ.20 లక్షల నిధులతో నిర్మించిన నాలుగు పంచాయితీ కార్యాలయాలను ప్రారంభించి, రూ.35 లక్షల 8 వేలు వ్యయం తో నిర్మించనున్న సీసీ రోడ్లు,పాఠశాల ప్రహరీ గోడ కు శంకుస్థాపనలు చేయనున్నారని పంచాయితీ రాజ్ డీఈఈ శ్రీధర్ ఆదివారం ప్రకటించారు.
ఉదయ 8 గంటలకు మద్దికొండ
గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించి,అదే గ్రామంలో నిర్మించనున్న సీసీ రోడ్ కు శంకుస్థాపన చేస్తారు.
ఉదయం 9.గంటలకు మొద్దులు గూడెం ప్రాధమిక పాఠశాల కాంపౌండ్ వాల్ శంకుస్థాపన చేస్తారు.
ఉదయం 9.30 గంటలకు కొత్త నారావారి గూడెం లో సీసీ రోడ్ శంకుస్థాపన చేస్తారు.
ఉదయం 10.15 గంటలకు నారం వారిగూడెం కాలనీ గ్రామ పంచాయితీ భవనం ప్రారంభిస్తారు.
ఉదయం 11.15 గంటలకు పాతల్లిగూడెం గ్రామ పంచాయతీ భవనం ప్రారంభిస్తారు.
ఉదయం 11.45 గంటలకు అశ్వారావుపేట గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
వినాయక పురం లో భోజనం విరామం ఉంటుంది.అక్కడ నుండి దమ్మపేట మండలం లో పర్యటిస్తారు.