చైనా మాంజ అమ్మితే చర్యలు తప్పవు: సిఐ ఉపేందర్ 

If China Manja is sold, action will not be taken: CI Upenderనవతెలంగాణ – సిద్ధిపేట 
పతంగుల దుకాణాలలో చైనా మాంజ అమ్మితే చర్యలు తప్పవని టూటౌన్ సిఐ ఉపేందర్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని పతంగుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ కమిషనర్  ఆదేశానుసారం పతంగుల షాపులలో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వం నిషేధించిన  చైనా మాంజాను  ఎవరైనా కలిగి ఉన్నా,  ఇతరులకు అమ్మిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నైలాల్‌, నింథటిక్‌ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలతో మనుషులతో పాటు, ఎగిరే పక్షులకు ప్రమాదకరమని,  రోడ్లపై మోటార్ సైకిల్ తో వెళ్లే వారికి కూడా అది చూడకుండా మెడకు, కాళ్లకు తట్టుకొని చనిపోయిన సంఘటనలు కూడా జరిగాయని తెలిపారు. పర్యవరణానికి విపత్తుగా కావడంతో జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ ఆదేశాలను మేరకు చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, ఏవరైన చైనా మాంజా విక్రయిస్తున్న, వినియోగిస్తున్న డయల్‌ 100నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేశం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.