నవతెలంగాణ-భిక్కనూర్
నర్సరీలో పెంచుతున్న మొక్కలను వాడిపోకుండా సంరక్షించాలని డి ఎల్ పి ఓ సాయిబాబా సూచించారు. బుధవారం మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలో నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శి సౌజన్యకు సూచించారు. అలాగే తడి పొడి చెత్త విధానాన్ని, శానిటేషన్, నాటిన మొక్కలను పరిశీలించారు. , ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ ప్రవీణ్ కుమార్, గ్రామ సర్పంచ్ జనగామ శ్రీనివాస్, ఉప సర్పంచ్ లతా సుధాకర్, ఎంపీటీసీ మీనా దుర్గ బాబు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.