సమయ పాలన పాటించని పల్లె దవాఖాన సిబ్బంది

– పట్టించుకోని వైద్యాధికారులు 
నవతెలంగాణ మల్హర్ రావు
ప్రభుత్వం పల్లె ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రతిష్టాత్మకంగా పల్లెల్లో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానలు,ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలపై మండల వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించడం లేదు.ఫలితంగా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందని ద్రాక్షలాగా మారింది.ఇందుకు నిదర్శనమే మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామంలో జీపీ కార్యాలయం ప్రక్కనున్న పల్లెదవాఖాన కార్యాలయానికి సోమవారం తాళం వేయడమే.ఇప్పటికైనా సంబంధించిన అధికారులు పర్యవేక్షణ చేసి,విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.