ఆర్ బి ఎస్ కే ఆధ్వర్యంలో బాలికలకు వైద్య పరీక్షలు…

నవతెలంగాణ – రెంజల్

ప్రజల మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఆర్.బి.ఎస్.కె ఆధ్వర్యంలో వైద్య పరీక్షలను నిర్వహించినట్లు డాక్టర్ విజయ భాస్కర్ తెలిపారు. ఎనీమియా ముక్తి భారత్ లో భాగంగా ఈ పాఠశాలలో 175 మంది బాలికలకు రక్తహీనత పరీక్షలను నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. రక్తహీనత కలిగిన విద్యార్థులను గుర్తించి వారికి మందులను ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూరిబా గాంధీ బాధిక పాఠశాల నిర్వాహకురాలు శ్యామల, ఆరోగ్య కార్యకర్త మంజుల, అకౌంటెంట్ సుజాత, ఆర్ బి.ఎస్ కె. ఏఎన్ఎం పూర్ణ తదితరులు పాల్గొన్నారు.