ఆచంపల్లి ఎక్స్ రోడ్ బ్లాక్ స్పాట్ నీ వివిధ శాఖల సమన్వయంతో సందర్శన 

నవతెలంగాణ – కంఠేశ్వర్

జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎక్కువ ప్రమాదాలు జరిగే ఆచంపల్లి ఎక్స్ రోడ్ బ్లాక్ స్పాట్ నీ వివిధ శాఖల సమన్వయంతో సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్ గారు బోధన్ టౌన్ సిఐ వెంకట్ నారాయణ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, జాతీయ రహదారి ఏ ఈ ఈ సతీష్ , ఐరాడ్ జిల్లా మేనేజర్ వర్షా నిహాంత్, పాల్గొని అక్కడ ప్రమాదాలు జరగకుండా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులకు సూచనలు ఇచ్చారు.