జిల్లా కేంద్రంలో టెక్నికల్ కోర్సులు నిర్వహించబడతాయి…

– జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని టెక్నికల్ కోర్సు- సర్టిఫికేట్ పరీక్షలు జనవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా  విద్యాశాకాధికారి  సత్యనారాయణ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకై జిల్లా కేంద్రంలోని రెండు సెంటర్లలో నిర్వహిస్తారని,  ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బీచ్ మహల్లా, ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జూ,, కా), భువనగిరి. డ్రాయింగ్ లోయర్ అండ్ హయ్యర్, టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ లో లోయర్ అండ్ హయ్యర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలు రాసే అభ్యర్ధులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావాలని, పూర్తి వివరాలకు ఏసిజిఈ కె రఘురాం రెడ్డి సెల్ : 9912096416 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.