ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు..

–  కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
–  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ 
పది సంవత్సరాలు అధికారంలో ఉండి ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ ఆర్బన్ మండలం అనుపురo గ్రామంలో 33 లక్షల విలువ గల 33 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్ చెక్కులను, 8లక్షల 02 వేల విలువ గల 21 ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంలోనే బిఆర్ఎస్ వారు 10 సంవత్సరాలలో చేయలేని పనులను చేసుకుంటూ ముందుకు పోతున్నామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంలో చేస్తున్న పనులను చూసి జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు,పది సంవత్సరాలు అధికారంలో ఉండి ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారు..? అని ప్రశ్నించారు.మేము 4696 ముంపు గ్రామాల ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కింద ఇస్తే మిగతావి ఎందుకు ఇయ్యలేదని అంటున్నారే మీ హయాంలో ఒక్క ఇల్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు అని నిలదీశారు.ఏటా 100 కోట్లు ఇస్తానని మీ నాయకుడు రాజన్నకే శఠగోపం పెట్టాడు..రాజన్న ఆలయ విస్తరణ, రోడ్లు వెడల్పు, అన్నదాన సత్రం నిర్మాణం, ముంపు గ్రామాలకు ఇందిరమ్మ ఇల్లు వంటి కార్యక్రమాలు చూసి ఓర్వలేకే ఇంటి పత్రికలో రోత పుట్టించే రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజన్న కోడెలను రైతులకు ఇచ్చే సంస్కృతి తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం..మళ్లీ మళ్లీ చెబుతున్న రాజన్న సొమ్ము అనా పైసా కూడా వృధా కానివ్వను అని హామీ ఇచ్చారు. మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతున్న బిఆర్ఎస్ భవన్ కు ప్రభుత్వం ఎకరామిస్తే రెండు ఎకరాలు కబ్జా అయిందని చెప్పారు.మళ్లీ రోత పుట్టించే రాతలు రాస్తూ సమాధానం చెప్పలేదు అనడం మీకే చెల్లిందని ఎద్దేవా చేశారు.కొదురుపాకలో ప్రజా సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు ఇస్తే దానిపై కూడా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేకు దరఖాస్తులు ఇస్తే చూసి ఓర్వలేక పోతున్నారు అని చెప్పారు.మేము ప్రజలకు జవాబు దారితనంగా పనిచేస్తున్నాం..
    ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 700 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపన చేశారు, కావాలంటే శిలాఫలకాలను వెళ్లి చూసుకోండి అని తెలిపారు.నేను రాజకీయాలకతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్న..దొరగారు చేతిలో బందీ అయిన తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పులోకి నెట్టారు అని మండిపడ్డారు.రాష్ట్రంలో భూమిలేని సుమారు 15 లక్షల కూలీలకు 12000 ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.
అర్బన్ మండలంలో మొన్నటి రోజున 2 కోట్ల 60 లక్షల ఈజీఎస్ నిధులు  కేటాయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ  అర్బన్ మండలా ధ్యక్షుడు   పిల్లి కనకయ్య, ఏఎంసీ చైర్మన్ ఆర్ రాజు, ప్రభాకర్ రెడ్డి, ఎర్రం రాజు, గ్రామస్తుల తో పాటు తదితరులు ఉన్నారు.