కాటారం మండల కేంద్రంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన మోడల్ కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులకు,అదేవిధంగా శ్రీపాద కాలనీలో రూ. 10 లక్షలతో నిర్మించనున్న సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు, శ్రీ హర్షిత డిగ్రీ కళాశాల నుండి సినిమా హాలు వరకు రూ.10 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు, వివేకానంద పాఠశాల నుండి అయ్యప్ప గుడి వరకు రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “మండల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ పనులు ప్రజల అవసరాలను తీర్చడంలో కీలకంగా ఉంటాయని, పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.