జనవరి 31న డాన్ బోస్కొ పండగ

నవతెలంగాణ – చండూరు 
జనవరి 31న డాన్ బోస్కొ  పండగ సందర్భంగా బోస్కోమాసం కార్యక్రమాలను కరస్పాండెంట్ ఫాదర్ రాజేష్   పావురం ను ఎగురవేసి , క్రీడా జ్యోతిని వెలిగించి  మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఫాదర్ రాజేష్  మాట్లాడుతూ 2 శతాబ్దాలక్రితం డాన్ బోస్కో  జననం తో ఏర్పాటయిన డాన్ బోస్కో సంస్థలు యువతకు విద్యను ఉపాధిని మార్గదర్శకం ను చూపిస్తూ వారికి మెరుగైన జీవితాలను ప్రసాదిస్తుంది అని కొనియాడారు. ఈ క్రమంలో సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ బాలశౌరి రెడ్డి  మాట్లాడుతూ డాన్ బోస్కో  వర్ధంతి సందర్భంగా ఈ బోస్కో మాసములో విద్యార్థులకు ఆటలు, పాటలు, కళలు , సాహిత్యం వంటి వివిధ రంగాలలో పోటీలను నిర్వహించడం జరుగుతుంది అన్నారు. విద్యార్థిని విద్యార్దులు పాల్గొని వారి ప్రతిభను చాటుకోవాలని కోరారు.డాన్ బోస్కో దిశా సంస్థ కో ఆర్డినేటర్ ఫాదర్ జస్టిన్, కెరియర్ అండ్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించి ఇంటర్ విద్య తరువాత ఉన్న అవకాశాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం , అధ్యాపకులు, విద్యార్దులు పాల్గొన్నారు.