మండలంలోని మోతె ఉన్నత పాఠశాలకు పోడియం అవశ్యకతను గుర్తించి వ్యాయామ ఉపాధ్యాయుడు సురేష్ కుమార్ కోరగా రోటరీ సభ్యులైన (దాత)వంగా వివేకానంద వెంటనే స్పందించి నూతన పోడియంను తయారు చేయించి పాఠశాలకు వితరణగా మంగళవారం అందజేసినారు..ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు రజినీష్ కిరాడ్ మాట్లాడుతూ పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమానికి పోడియం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుందని ఇది విధిగా ప్రతి పాఠశాలకు ఉండవలసినటువంటి అవసరం ఉందని గుర్తించి మా రోటరీ సభ్యులు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్ అడగగానే వితరణగా పాఠశాలకు అందజేశామన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని,విద్యార్థులకు స్కూల్ లైఫ్ గోల్డెన్ లైఫ్ అని,ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని,ఇంకా మున్ముందు మీ పాఠశాలకు ఏ అవసరాలు ఉన్నా మేము మా రోటరీ తరఫున ఏర్పాటు చేస్తామన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ రోటరీ సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు రోటరీ సభ్యులు పుష్పకర్ రావు, చెలిమెల రాజేంధర్,ఖాందేశ్ సత్యం తదితరులు పాల్గొన్నారు.