ఎస్సైను సన్మానించిన ప్రథమ చికిత్స వైద్యులు

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని ప్రథమ చికిత్స వైద్యులు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎస్సై ఆంజనేయులును బుధవారం శాలువాతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్ఎంపి, పీఎంపీ అధ్యక్షులు సత్యనారాయణ, పట్టణ వైద్యులు గంగాధర్, సుదర్శన్, ఆంజనేయులు, రమేష్, పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.