నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలోని అత్యంత పురాతన మాల్ట్ డిస్టిలరీ మరియు దేశంలోని అతిపెద్ద మెచ్యూరేషన్ వేర్‌హౌస్ కి నిలయంగా భాసిల్లుతున్న సౌత్ సీస్ డిస్టిలరీస్, భారతదేశపు అరుదైన విస్కీలు – క్రేజీ కాక్ సింగిల్ మాల్ట్ విస్కీలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఇవి రెండు అద్భుతమైన రూపాలు , RARE మరియు DHUA గా లభించనున్నాయి, క్రేజీ కాక్ సింగిల్ మాల్ట్ విస్కీలు ఇప్పుడు మహారాష్ట్ర, గోవా మరియు హర్యానాలోని ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, గోవా మరియు చండీగఢ్‌లోని డ్యూటీ ఫ్రీ అవుట్‌లెట్‌లతో పాటు అంతర్జాతీయంగా యూఏఈ లో కూడా అందుబాటులో ఉన్నాయి.
నాలుగు దశాబ్దాల మాల్ట్ నైపుణ్యంతో రూపొందించబడిన ఈ విస్కీ లు, భారతదేశంలోని అత్యంత పురాతన లగ్జరీ సింగిల్ మాల్ట్‌లు. చాలా పరిమిత పరిమాణంలో విడుదల చేయబడిన ఈ విస్కీలు మహారాష్ట్రలోని దహానులో సౌత్ సీస్ డిస్టిలరీస్ యొక్క అత్యాధునిక సౌకర్యాలలో పరిపక్వం చేయబడ్డాయి. భారతదేశంలోని ప్రత్యేకమైన వాతావరణంకు తగినట్లుగా, ఉష్ణమండల పరిపక్వతలో ప్రావీణ్యం సంపాదించిన డిస్టిలరీ, క్రేజీ కాక్ సింగిల్ మాల్ట్ వంటి విస్కీలను అందిస్తుంది, ఇది చల్లని ప్రాంతాల నుండి తీర్చిదిద్దిన 25 ఏళ్ల మాల్ట్‌లతో పోల్చదగిన రీతిలో ఉంటుంది. ఈ సింగిల్ మాల్ట్‌లు భారతదేశ వాతావరణంలో ఓక్ పీపా ప్రవర్తనపై డిస్టిలరీ యొక్క లోతైన అవగాహనను ప్రతిబింబిస్తాయి, ప్రతి సిప్‌కి ఒక ప్రత్యేక లక్షణాన్ని అందిస్తాయి.
సింగిల్ మాల్ట్ మేకింగ్ యొక్క కళ
నాలుగు దశాబ్దాల మాల్ట్ అనుభవంతో, సౌత్ సీస్ డిస్టిలరీస్ భారతదేశపు మాల్ట్ విస్కీ వారసత్వానికి మూలస్తంభంగా నిలిచింది, ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌ల కోసం ప్రపంచ స్థాయి మాల్ట్‌లను ఇది రూపొందించింది. క్రేజీ కాక్ సింగిల్ మాల్ట్ వారి స్వంత లగ్జరీ వినియోగదారు బ్రాండ్‌ను ఆవిష్కరించడానికి వారి సాహసోపేత మార్పును సూచిస్తుంది. వ్యవస్థాపకుని అభిరుచి మరియు స్థిరత్వం తో కూడిన ఈ ప్రయత్నం, వ్యాపారంగా కాకుండా ఒక కళారూపంగా సింగిల్ మాల్ట్ తయారీని ప్రదర్శిస్తుంది. క్రేజీ కాక్ సింగిల్ మాల్ట్ విస్కీల తయారీలో ప్రతి దశలోనూ శ్రేష్ఠతను సౌత్ సీస్ ప్రదర్శించింది – ఐకానిక్ కాపర్ పాట్ స్టిల్స్‌లో వీటిని రెండుసార్లు డిస్టిల్ చేయడం నుండి ఈ కాపర్ పాట్ స్టిల్స్, ప్రీమియం లేబుల్‌ల ఆకారంతో స్ఫూర్తిని పొంది, చక్కగా రూపొందించిన బాటిల్ డిజైన్ వరకు ఇది కనిపిస్తుంది , మరియు అరుదైన ఫ్లోర్-గ్రేడ్ కార్క్‌లు ఇక్కడ వున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1% కంటే తక్కువ కార్క్ చేసిన ఉత్పత్తులలో ఫ్లోర్-గ్రేడ్ కార్క్‌లు ఉపయోగించబడుతున్నాయి.
వారసత్వం తో కూడిన పేరు
ఈ పేరు వ్యవస్థాపకుడి దృష్టికి ఒక నివాళి: “క్రేజీ” అనేది భారతదేశంలో సింగిల్ మాల్ట్‌లు వాస్తవంగా తెలియని సమయంలో ప్రపంచ స్థాయి డిస్టిలరీకి మార్గదర్శకత్వం వహించడానికి అతనిని ప్రేరేపించిన అభిరుచి మరియు మొండితనానికి ప్రతీక. కోడి పుంజు యొక్క కూత , లేదా “కాక్”, కొత్త రోజును సూచిస్తున్నట్లే, అతిపెద్ద భారతీయ మరియు ప్రపంచ బ్రాండ్‌లకు మద్దతు ఇవ్వడమే కాకుండా క్రేజీ కాక్ సింగిల్ మాల్ట్ విస్కీల ప్రారంభం సౌత్ సీస్‌కు, దాని స్వంత ఒరిజినల్ బాట్లింగ్‌ను కూడా విడుదల చేయడానికి కొత్త శకాన్ని సూచిస్తుంది.
క్రేజీ కాక్ సింగిల్ మాల్ట్ రేర్ అనేది డబుల్ ఓక్ బారెల్స్‌లో నిల్వ చేయబడిన అపూర్వమైన శైలి , ఇది గొప్ప కాషాయం మరియు వెల్వెట్ ఫినిషింగ్‌ను అందిస్తుంది. క్రేజీ కాక్ సింగిల్ మాల్ట్ DHUA, హిందీలో పొగ అని అర్థం, ఇది స్మోకీ అండర్ టోన్‌లు మరియు సంక్లిష్టమైన ప్రొఫైల్‌తో కూడిన విస్కీ .
సౌత్ సీస్ డిస్టిలరీస్ డైరెక్టర్ రూపి చినోయ్ మాట్లాడుతూ, “మా కుటుంబ చరిత్ర మరియు మాల్ట్‌లతో అనుబంధం దేశంలోని చాలా సంస్థల కంటే ముందే ఉంది. ఇది సౌత్ సీస్ కు కేవలం వ్యాపారం కాదు; ఇది వేగం మరియు వ్యాప్తి కంటే సమయం మరియు సహనానికి ప్రాధాన్యతనిచ్చే విస్కీ తయారీకి హృదయపూర్వకమైన అన్వేషణ” అని అన్నారు.
అదనంగా, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగుళూరు, గోవా మరియు చండీగఢ్ సహా భారతదేశం అంతటా డ్యూటీ-ఫ్రీ అవుట్‌లెట్‌లలో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న RARE మరియు DHUA (46%) యొక్క అధిక-ABV వేరియంట్‌లను పరిచయం చేయడం ద్వారా అభిరుచి గల యాత్రికుల అవసరాలను తీర్చడానికి సౌత్ సీస్ ఒక అడుగు ముందుకు వేసింది. ఇవి UAEలో రిటైల్ కోసం కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రావెల్-ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లు మహోన్నత , మరింత తీవ్రమైన సింగిల్ మాల్ట్ అనుభవాన్ని అందిస్తాయి.
సౌత్ సీస్ డిస్టిలరీస్ డైరెక్టర్ హమావంద్ చినోయ్ మాట్లాడుతూ “మా డిస్టిలరీలో అత్యంత ప్రత్యేకమైన అంశం విస్తారమైన లిక్విడ్ లైబ్రరీ. అన్‌పీటెడ్ లేదా పీటెడ్ వెరైటీలను ఆస్వాదించే వినియోగదారుల కోసం లగ్జరీ సింగిల్ మాల్ట్‌ల శ్రేణిని తీర్చిదిద్దడానికి మేము మా ప్రైవేట్ కలెక్షన్ యొక్క అరుదైన క్యాస్క్‌ల నుండి రేర్ మరియు DHUAని ఎంచుకున్నాము. ఈ రెండు రకాలు , ఎక్స్-బోర్బన్ మరియు ఎక్స్-షెర్రీ ఫస్ట్-ఫిల్ క్యాస్క్‌లలో పరిపక్వం చెందాయి, వినియోగదారులకు వారి ప్రత్యేక లక్షణం, నిజంగా ప్రత్యేకంగా నిలుస్తుంది.
బియాండ్ సింగిల్ మాల్ట్స్ నైపుణ్యం: సిక్స్ బ్రదర్స్ మహురా
సౌత్ సీస్ తన భండాగారంను విస్తరిస్తూ, సిక్స్ బ్రదర్స్ మహురాతో హెరిటేజ్ ఇండియన్ మహురా (మహువా) స్ఫూర్తిని పునరుద్ధరించింది, ఇది పూర్తిగా మహురా పువ్వులతో తయారు చేయబడింది మరియు క్రేజీ కాక్ సింగిల్ మాల్ట్ వలె అదే కాపర్ పాట్ స్టిల్స్ లో డిస్టిల్డ్ చేయబడింది. టెక్విలా, కాగ్నాక్ మరియు స్కాచ్ వంటి గ్లోబల్ స్పిరిట్స్‌లో చేరడానికి, సిక్స్ బ్రదర్స్ మహురా డిస్టిలరీ యొక్క మార్గదర్శక స్ఫూర్తికి ఉదాహరణ. మాల్ట్ పరిపక్వతలో నాలుగు దశాబ్దాల నైపుణ్యం మరియు సింగిల్ మాల్ట్ , మహురా కేటగిరీలలో కొనసాగుతున్న ఆవిష్కరణలతో, సౌత్ సీస్ డిస్టిలరీస్ భారతీయ స్పిరిట్స్ ను ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉంది.
ఉత్పత్తి వివరాలు
క్రేజీ కాక్ సింగిల్ మాల్ట్ రేర్ విభిన్న మార్కెట్‌ల అవసరాలను తీర్చటానికి రెండు ఫార్మాట్‌లలో అందుబాటులో ఉంది. భారతదేశంలో, ఇది 42.8% ABV వద్ద 750ml సీసాలలో లభిస్తుంది, మహారాష్ట్ర, గోవా మరియు హర్యానా అంతటా రూ. 6,000 – రూ. 8,900 మధ్య ధరలో పంపిణీ చేయబడుతుంది. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, గోవా మరియు చండీగఢ్‌లలోని డ్యూటీ-ఫ్రీ అవుట్‌లెట్‌ల కోసం, ఇది 750ml బాటిళ్లలో 46% ABV వద్ద అందించబడుతుంది, దీని ధర రూ. 8,000.
క్రేజీ కాక్ సింగిల్ మాల్ట్ DHUA రెండు విభిన్న వేరియంట్‌లతో 750ml బాటిళ్లలో కూడా అందుబాటులో ఉంది. భారతదేశంలో, మహారాష్ట్ర, హర్యానా మరియు గోవా అంతటా DHUA 42.8% ABVతో అందించబడుతుంది, దీని ధర రూ. 8,000 – రూ. 12,500 మధ్య ఉంటుంది. డ్యూటీ ఫ్రీ దుకాణదారుల కోసం, విస్కీలు ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, గోవా మరియు చండీగఢ్‌లోని అవుట్‌లెట్‌లలో 46% ABV, రూ. 11,800 నుండి లభిస్తాయి.