ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత శిక్షణ తీసుకొని జోనల్ ఫస్ట్ ర్యాంకు ద్వారా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా నిలవేణి ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా గురువారం స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆమెను శాలువతో సన్మానించారు. అనంతరం నిలవేణి మాట్లాడుతూ.. సిలబస్, నమూనా పరీక్షలు, రీజనింగ్ ఎక్కువగా చదవడం వల్లనే ఉద్యోగం వస్తుందని తెలియజేశారు. తన సక్సెస్ ను తోటి అభ్యర్థులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టడీ సర్కిల్ సిబ్బంది ఎర్రమ్మ, నరేశ్, అరుణ, శ్రీవాణి, విద్యార్థులు పాల్గొన్నారు.