పొనకల్ గ్రామ పంచాయతీ కార్యాలయం లో నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మి నారాయణ,వైస్ చైర్మన్ సయ్యద్ ఫసిఉల్లా, అంబేద్కర్ సంఘం సభ్యులు మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ గా ఎన్నికైన రేగుంట ప్రదీప్,ఎల్లా లావణ్య లకావత్ తిరుపతి,సోనేరావు లకు మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు సిటీమల భరత్ కుమార్ మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపిన మార్గం లో నడిచి మండల రైతులకు సేవ చేయాలనీ కోరడమైనది మండల రైతులకు తమ సేవలను అందించి, రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని వారిని కోరారు.ఈ కార్యక్రమంలో ,అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు బోర్లాకుంట ప్రభుదాస్,అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మామిడిపల్లి ఇందయ్య, ముజాఫర్ అలీఖాన్( కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, )రాష్ట్ర నాయకులు గవ్వల శ్రీకాంత్, నాయకులు బండారి స్వామి, బెంజమెన్,అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షులు ప్రశాంత్,అంబేద్కర్ సంఘం మండల నాయకులు కొందుకూరి ప్రభుదాస్,ముల్కల్లా ప్రభాకర్ జంగం రవి,దుమల్ల ప్రవీణ్,కుంబాల రాజన్న,ప్రశాంత్,కొండుకూరి రాజు,బందెల జీవన్ ఎల్లా నాగేందర్,ముల్కల్లా సత్తన్న,బండారి స్వామి ముల్కల్లా రమేష్ తదితరులు పాల్గొన్నారు.