టైగర్ జోన్ పేరిట ఆంక్షలు విధించడం సరికాదని బీసీ జాగృతి సేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి విజయ్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గృహ అవసరాలను నిత్యం ఇసుకను తీసుకువస్తుండగా అడ్డవి శాఖ అధికారులు ట్రాక్టర్లను పట్టుకొని అధిక జరిమానాలు విధించి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారు దొరకకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తూ ఎన్నో డబ్బులు గడిస్తున్నారని వారిని పట్టుకోకుండా గృహ అవసరాల నిమిత్తం ఇసుక తీసుకవెళుతున్న ట్రాక్టర్లను పట్టుకొని జరిమానాలు విధించడం సరికాదని అన్నారు.ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసి గృహ నిర్మాణ అవసరాల నిమిత్తం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తహసిల్దార్ చొరవ చూపాలని కోరారు. అంతేకాకుండా గృహ అవసరాల నిమిత్తం ఇసుక తీసుకు వెళ్తున్న ట్రాక్టర్ల పై జరిమానాలు విధించిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే బీసీ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.