ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే ‘హత్య’

‘మధ’ వంటి సైకలాజికల్‌ థ్రిల్లర్‌తో అందరినీ మెప్పించిన దర్శకురాలు శ్రీ విద్య బసవ ‘హత్య’ అనే మరో థ్రిల్లర్‌ మూవీతో ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ఈనెల 24న రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాను మహాకాళ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌. ప్రశాంత్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ధన్య బాలకష్ణ, పూజా రామచంద్రన్‌, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ వేడుక గురువారం జరిగింది. నటుడు రవివర్మ చేతుల మీదుగా టీజర్‌ విడుదలైంది.
ఈ సందర్భంగా దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ, ”మధ’ తరువాత థ్రిల్లర్‌ జోనర్‌లోనే రెండో సినిమా కూడా చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ గ్రిప్పింగ్‌గా, సీట్‌ ఎడ్జ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ మూవీగా అలరించేలా తెరకెక్కించాను. చాలా హార్డ్‌ వర్క్‌, ఎఫర్ట్స్‌ పెట్టి స్క్రీన్‌ ప్లే రాసుకుని చేసిన సినిమా ఇది. ఈ ప్రయాణంలో నాకెంతో సపోర్ట్‌ చేసిన నటీనటులు ధన్య బాలకష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్‌ సహా అందరికీ థ్యాంక్స్‌. నరేష్‌ అద్భుత మైన బీజీఎంను అందించాడు. అభిరాజ్‌ విజువల్స్‌ చక్కగా కుదిరాయి. అనిల్‌ ఎడిటింగ్‌ సినిమాను మరింత క్యూరియస్‌గా మార్చింది. మా నిర్మాత ప్రశాంత్‌కి థ్యాంక్స్‌. ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
”మధ’ సినిమా టీజర్‌ చూడగానే నేను శ్రీవిద్యకు కాల్‌ చేశాను. నేను కూడా సినిమాలో భాగం అవుతానని అన్నాను. చాలా చిన్న పాత్ర ఉందని చెప్పింది. నాకు నేనుగా వెళ్లి ఆ సినిమాలో యాక్ట్‌ చేశాను. అప్పుడు ఆమెతో ప్రారంభమైన ఆ జర్నీ ఇప్పుడు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించేలా చేసింది. రొటీన్‌కు భిన్నమైన రోల్‌ను శ్రీవిద్య నన్ను లుక్‌ టెస్ట్‌ చేసి ఎంపిక చేసింది. ఇది నాకొక ఛాలెంజింగ్‌ రోల్‌. శ్రీవిద్య కొత్త టైప్‌ ఆఫ్‌ మేకింగ్‌కి తెర తీసింది. సినిమా అందరినీ ఎంగేజ్‌ చేసే ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌. ఆడియెన్స్‌కు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది’ అని నటుడు రవివర్మ చెప్పారు.
నటి పూజా రామచంద్రన్‌ మాట్లాడుతూ, ‘ఇందులో నాది కీ రోల్‌. సినిమానంత మార్చేసే చాలా ముఖ్యమైన పాత్రలో నటించాను. చాలా కాలం తర్వాత ఇటువంటి డిఫరెంట్‌ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ శ్రీవిద్యకి థ్యాంక్స్‌. రవివర్మ అద్భుతమైన నటుడు. శ్రీవిద్య ఎక్స్‌లెంట్‌ డైరెక్టర్‌. తను ఇండిస్టీలో ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను. అందరి దగ్గరి నుంచి బెస్ట్‌ ఔట్‌పుట్‌ను రాబట్టుకుంది. అభిరాజ్‌ ప్రతీ ఫ్రేమ్‌ను బ్యూటీఫుల్‌గా క్యాప్యర్‌ చేశారు. నరేష్‌ తన మ్యూజిక్‌తో సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లారు’ అని తెలిపారు.