నేడు రాజస్థాన్‌కు మంత్రి సీతక్క

– చింతన్‌ శివీర్‌లో శనివారం ప్రసంగం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ(సీతక్క) రాజస్థాన్‌లోని ఉదరుపూర్‌కు వెళ్లనున్నారు. అక్కడ శనివారం జరిగే చింతన్‌ శివీర్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మిషన్‌ వాత్సల్య, మిషన్‌ శక్తి, అంగన్వాడీ పోషన్‌ 2.0పై అందులో చర్చ జరుగనున్నది. తెలంగాణలో మహిళా, శిశు సంక్షేమం కోసం ప్రత్యేకంగా అమలవుతున్న పథకాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారం, తదితర అంశాలపై సీతక్క ప్రసంగించనున్నారు.