కిషన్‌రెడ్డికి స్వాగతం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బుధవారం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బండి సంజరు వినతి
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజరు న్యూఢిల్లీలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. హసన్‌పర్తి (కాజీపేట) నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లైన్‌ను నిర్మించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రాజెక్టు సమగ్ర నివేదికను తెప్పించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రితో జరిగిన సమావేశంలో బండి సంజరు వెంట కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరే శ్రీరాం, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప ఉన్నారు.