నవతెలంగాణ -తాడ్వాయి
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి ఆధ్వర్యంలో జిల్లాలో అత్యధికంగా మహిళలను, కాంగ్రెస్ మహిళల మెంబర్షిప్ అధికంగా చేయించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా హైదరాబాదులో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోనే కాంగ్రెస్ మహిళ మెంబర్షిప్ లో ప్రథమ స్థానంలో నిలువగా, అట్టి ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ను, రాష్ట్ర కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు సునీతా రావు చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు. అనంతరం జిల్లా మహిళా అధ్యక్షురాలి పదవి యొక్క పత్రాన్ని అందుకున్నారు. కాగా రాష్ట్రంలోనే మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ లో ములుగు జిల్లా ను ప్రథమ స్థానంలో నిలిచిన తాడ్వాయి మండలం కామారం (పీటీ) గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రేగ కళ్యాణికి, రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ నాయకులతో ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రేగ కళ్యాణి అభినందించారు.