– లేని యెడల చట్ట పరమైన శిక్షలు తప్పవు
– కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఎండి షరీఫ్
నవతెలంగాణ – మల్హర్ రావు/కాటారం
కాటారం సబ్ డివిజన్ లోని కాటారం ,మహాదేవపూర్ ,మహాముత్తారం ,పలిమెల ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని వ్యవసాయ శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రవేట్ వ్యక్తులు రైతుల నుండి ప్రత్తి కొనుగోలు చేస్తే కటిన తరమైన శిక్షలు తప్పవని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఎండి షరీఫ్ అన్నారు.ఈ నెల 5న నవ తెలంగాణ దినపత్రికలో పత్తి రైతులను నిండా ముంచుతున్న దళారులు అనే కథనానికి ఆయన స్పందించారు. శుక్రవారం మాట్లాడారు మాట్లాడారు.ప్రయివేటిగా రైతుల నుండి పత్తి కొనుగోలు చేసే వ్యక్తులు తప్పనిసరిగా ట్రేడ్ లేసేన్సు తీసుకోవాలని తెలిపారు.లేని యెడల చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు .రైతులు ఎట్టి పరిస్టిలలోదళారులకు పత్తి అమ్మకుండా నేరుగా పత్తి మిల్లులలోనే ప్రత్తి అమడం వలన రైతులు ఎలాంటి మోసం జరుగదని రైతులకు సరైన ధర వస్తుందని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.