అలరిస్తున్న చిన్నారుల రంగురంగుల ముగ్గులు..

Colorful groups of children having fun..నవతెలంగాణ – భీంగల్ రూరల్
భీంగల్ మండలంలోని జాగిర్యాల గ్రామంలోని మండల పరిషత్ స్కూల్లో  సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థిని విద్యార్థులు రంగుల ముగ్గులతో, గాలిపటాలతో సందడి చేశారు. రంగవల్లులతో పండుగకు కొత్త శోభ తీసుకొచ్చారు. ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వేడుకలు నిర్వహించే స్కూల్ యాజమాన్యం ఈసారి కూడా అదే ఉత్సవంతో విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేసి పోటీలో పాల్గొన్నారు,స్కూల్లో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు పాఠశాల నుండి బహుమతులు అందజేశారు.