నవతెలంగాణ – మల్హర్ రావు
గిరిజన, ఆదివాసీల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ, పంచాయతీ శాఖ మంత్రి సీతక్క పోరాటం చేస్తున్నట్లుగా అఖిల భారత గిరిజన, ఆదివాసీ కాంగ్రెస్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, పోరిక సమ్మయ్య నాయక్, భూపాలపల్లి జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు సవేందర్ తెలిపారు.నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ హిల్కాలనీలో వారం రోజుల పాటు జరుగుతున్న శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. జల్, జంగల్, జమీన్ అనే నినాదానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఈ నినాదంపై రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. గిరిజనులు, ఆదివాసీల అండతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారి హక్కులను కాలరాసేలా పనిచేస్తోందని విమర్శించారు. కొన్ని పార్టీలు కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల్లో వైషమ్యాలను పెంచి పబ్బం గడుపుకొంటున్నాయని ఆరోపించారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ నూ కేంద్రంలో అధికారంలోకి తీసుకో రావడానికి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి అందరూ కలిసిరావాలని సీతక్క పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లకావత్ సవేందర్ తో పాటు వివిధ జిల్లాల ఆదివాసీ గిరిజన నాయకులు పాల్కొన్నారు.