నవతెలంగాణ – ధర్మసాగర్
స్వయం సహాయక బృందాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని జిల్లా రెడ్క్కో మేనేజర్ మహేందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆయన సోలార్ ప్లాంట్ నిర్వహణకై స్థల సేకరణ కోసం శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న సోలార్ ప్లాంట్ల నిర్వహణకై గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు సరైన స్థల సేకరణకై మండలంలోని జానకిపూర్ ,నారాయణగిరి, ముప్పారం ,ధర్మసాగర్ ,ఎల్కుర్తి పెద్ద పెండ్యాల, ధర్మపురం మరియు ఉనికిచెర్ల గ్రామాలలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటనకై కావలసిన భూసేకరణకై జాయింట్ సర్వే ను నిర్వహించామన్నారు, త్వరలో వాటి ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్థానిక తహసిల్దార్ సదానందం, ఎంపీడీవో కె అనిల్ కుమార్,సంయుక్తంగా సర్వేను నిర్వహించడం జరిగిందనీ తెలిపారు. ఈ సర్వేలో డిపిఎం జన్ను ప్రకాష్,దిలీప్, ఏపీఎం శ్రీమతి అనిత,ఆర్ ఐ, సంబంధిత గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొనడం జరిగింది.