కల్లుగీత కార్మికుల ఎక్స్  గ్రెషియాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి..

Govt should immediately pay the ex gratia of stone masons..– బోలగాని జయరాములు కల్లు గీత కార్మిక సంఘం. జిల్లా ప్రధాన కార్యదర్శి. .
నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్లుగీత వృత్తి చేస్తూ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి  తీవ్ర గాయాలుతొ మంచాన పడి భవిష్యత్తులో వృత్తి చేయలేని పరిస్థితిలో ఉన్న గీతా కార్మిక కుటుంబాలకు. వృత్తి చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు జిల్లాలో పెండింగ్లో ఉన్న రూ. 2 కోట్ల 87 లక్షల ను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేసి అట్టి కుటుంబాలకు చెల్లించాలని కల్లు గీతా కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి బోలగాని జయరాములు ప్రభుత్వాన్ని కోరారు.  శనివారం స్థానిక వృత్తిదారుల భవన్లో జరిగిన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షులు రాగీర్ కృష్ణయ్య  అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంలో జయరాములు మాట్లాడుతూ చేతివృత్తులలో అత్యంత ప్రమాదకరమైన వృత్తి కల్లుగీత వృత్తి అని ప్రమాదం అని తెలిసినా కల్లుగీత కార్మికులు తమ జీవనోపాధి కోసం గత్యంతరం లేని పరిస్థితులలో కల్లుగీత వృత్తిలో కొనసాగుతున్నారన్నారు.  వృత్తి చేస్తున్న సందర్భంలో జిల్లాలో ప్రమాదవశాత్తు తాటి చెట్ల పై నుండి పడి తీవ్ర గాయాల పాలైన పర్మినెంట్ డిజిబిలిటి కుటుంబాలు 38,లమృతి చెందిన కుటుంబాలు 17 .తాత్కాలిక డిజిబిలిటీ కార్మికులు 26  మంది  చాలా దీనావస్థలో ఉన్నాయన్నారు. వారికి ఎక్స్ గ్రేషియాలు  రెండు కోట్ల 80 లక్షలు రూపాయలు మంజూరై సంవత్సరం గడిచిన ఇప్పటివరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయ్యలేదన్నారు. అట్టి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా డబ్బులు అందలేదని దానితో అట్టి కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం ఎక్స్  గ్రషియా నిధులను విడుదల చేసి కల్లుగీత కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నామని చెప్పారు. కల్లుగీత వృత్తిలో ప్రమాదాలు నివారించడానికి నూతనంగా ప్రవేశపెట్టిన కాటమయ్య రక్షణ కిట్టులను జిల్లాలోని 17వేల మంది కల్లుగీత కార్మికులకు తక్షణమే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఎక్స్  గ్రిషియా నిధుల మంజూరులో జాప్యం చేస్తే ఈనెల 20వ తారీకున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎక్స్ గ్రెషీయా బాధితులతో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతామని తెలిపారు.  ఈ సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం  జిల్లా ఉపాధ్యక్షులు నెమిలే మహేందర్ గౌడ్,  గాజుల ఆంజనేయులు, గుండ్లపల్లి వెంకటేష్ గౌడ్,  కొక్కొండ లింగయ్య, జిల్లా సహయ కార్యదర్శులు అంతటి అశోక్, బత్తిని బిక్షం, పులి బిక్షం, చెరుకు మల్లేశం పాల్గొన్నారు.