హైదరాబాదులోని తన నివాసంలో జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా క్యాలెండర్ ను పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ సమస్యల పరిష్కారానికి జై గౌడ ఉద్యమం చేస్తున్న కృషిని కొనియాడారు. గౌడుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందన్నారు. కాటమయ్య రక్ష పేరిట గీతా కార్మికులకు రక్షణతో కూడిన పనిముట్లను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావుగౌడ్, టిపిసిసి కార్యదర్శి మాదు సత్యం గౌడ్, హిమాయత్ నగర్ కార్పొరేటర్ జి రామన్ గౌడ్, జై గౌడ్ ఉద్యమం రాష్ట్ర అధికార ప్రతినిధి బాంబోతుల లింగాగౌడ్, జై గౌడ్ ఉద్యమం జిల్లా అధ్యక్షులు రంగోల మురళి గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకెన గారి శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, పండరి గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.