చైన్ స్నాచింగ్ కేసులలో నిందితుల అరెస్టు..

Arrest of accused in chain snatching casesనవతెలంగాణ – ఆర్మూర్ 

పట్టణంలో ఇటీవల జరిగిన వరుస చైన్ స్నాచింగ్ కేసులలో నిందితులను అరెస్టు చేసినట్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జె. వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ యందు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలోని జమ్మన్ జెట్టి గల్లీకి చెందిన బట్టు బాలరాజ్  జల్సా లకు  అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో మైనర్ అబ్బాయితో కలిసి, అతని యొక్క రిజిస్ట్రేషన్ కానీ హోండా యాక్టివా స్కూటీపై తిరుగుతూ చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్ 28 రాత్రిపూట పట్టణంలోని విశాఖ కాలనీ, రాజారాం నగర్ కాలనీ, ఈనెల 7వ తేదీ మామిడిపల్లిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళల మెడలో నుండి బంగారు పుస్తెలతాడు తెంపుకొని, నూనె గంగాధర్, హరిచంద్ర ప్రసాద్ లకు అమ్మినట్టు తెలిపారు. వాహన తనిఖీలలో భాగంగా శనివారం సాయంత్రం పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర నేరస్తులను పట్టుకున్నట్లు తెలిపారు. వీరి వద్దనుండి  7 తులాల బంగారం, హోండా యాక్టివా స్కూటీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.. ఈ సందర్భంగా స్థానిక  ఎస్సైలు మహేష్, గోవింద్, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, ఐడి పార్టీ కానిస్టేబుల్ లకు ఏసీబీ అభినందించి రివార్డులను ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.