– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కొబ్బరి రైతుల సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సాగు దారులు……
– తెలంగాణ లో సీడీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కు వినతి పత్రం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
కొబ్బరి అభివృద్ది మండలి 45 వార్షికోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్,అంబేద్కర్ కోనసీమ జిల్లా,రావులపాలెం లోని సీ.ఆర్.సీ కన్వెన్షన్ హాల్ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ అద్యక్షతన ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కొబ్బరి రైతుల సమావేశానికి తెలంగాణ నుండి తెలంగాణా కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర అద్యక్ష కార్యదర్శులు కొక్కెరపాటి పుల్లయ్య,తుంబూరు మహేశ్వర రెడ్డి లతో సహా పలువురు రైతులు హాజరు అయ్యారు. అనంతరం కొబ్బరి అభివృద్ది బోర్డ్ ప్రాంతీయ కార్యాలయాన్ని తెలంగాణ లోని అశ్వారావుపేట లో ఏర్పాటు చేయాలని సీడీబీ చైర్మన్ శుభా నాగరాజన్ కు తెలంగాణ కొబ్బరి రైతుల సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందించారు. వినతి పత్రం సారాంశం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కొబ్బరి అబివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి రైతులు సమస్యల పరిష్కారం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో 9 వేల ఎకరాలకు పైగా కొబ్బరి సాగు అవుతున్నది.అందులో సుమారుగా 5 వేల ఎకరాల పైగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉన్నది.తెలంగాణ రాష్ట్ర కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి విజయవాడ కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొబ్బరి బోర్డుపై ఆధార పడవల్సివస్తుంది,ఈ నేపథ్యంలో తెలంగాణాలో కొబ్బరి అబివృద్ధి బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని కోరుచున్నాము. తెలంగాణ రాష్ట్రంలో కొబ్బరి సాగు విస్తీర్ణం పెరుగుదలపై అవసరమైన హైబ్రిడైజేషన్ (సంకరీకరణ) చేసిన మొక్కలు రైతులకు అందుబాటు కావటం లేదు, తెలంగాణలో కొబ్బరి సంకరీకరణ ప్రారంభించి రైతులకు అందబాటులోకి తేగలరు అని కోరుచున్నాము. ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణా రైతులకు ఆంధ్రప్రదేశ్లోని అంబాజిపేట, వేగివాడ నుంచి సంకరీకరణ చేసిన మొక్కలు రైతులకు అందించే ఏర్పాటు చేయించ గలరని కోరుతున్నాము. బిందు సేద్యం పరికరాలు కొబ్బరి తోటలు వేసుకున్న ప్రతి రైతుకు అందేలా చూడ గలరని విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణలో కొబ్బరి బోర్డు సిబ్బంది అతి తక్కువగా ఉన్నారు. ప్రతి చిన్న సమస్యకు ఆంద్రప్రదేశ్ లో విజయవాడ బోర్డు పై ఆధారపడాల్సి వస్తుంది. తెలంగాణాలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి సిబ్బందిని పెంచ గలరని విజ్ఞప్తి చేస్తున్నాము అని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మ రాంబాబు,తలశిల ప్రసాద్,పసుపులేటి ఆదినారాయణ,దొడ్డ లక్ష్మినారాయణ, బాల కేశవరావు, చక్రధర్ రెడ్డి పాల్గొన్నారు.