
వాహనదారులు జాగ్రత్తలు పాటించి తమ వాహనాలను నడపాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ బిక్షపతి తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా టోల్ ప్లాజా సమీపంలో ప్రతి వాహనదారుడు సీట్ బెల్ట్ ధరించాలని, వాహనానికి రేడియం స్టిక్కర్లను అతికించారు. రహదారిపై వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడ రాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు అశోక్ , సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.