బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే..

MLA visited the victim's family.నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని బిజెపి సీనియర్ నాయకులు నర్సింలు కుటుంబాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆదివారం ఆయన నివాసంలో పరామర్శించారు. నర్సింలు తండ్రి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించడంతో పరామర్శించి ఓదార్చారు. అలాగే నర్సింలు ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంటా బిజెపి మండల అధ్యక్షులు రమేష్, జిల్లా నాయకులు రమేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జైపాల్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.