అభినయ, చతుర, సతీష్ నీనాసం నటించిన చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. కన్నడ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ మూవీని వద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్స్ హౌస్ పతాకలపై వర్ధన్ నరహరి, జైష్ణవి, సతీష్ నీనాసం నిర్మిస్తున్నారు. వినోద్ దొండలే దర్శకుడు. ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తయింది.తాజాగా సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే పాట, బీజీఎం, హీరోని చూపించిన విధానం, ఆ రక్తపాతం చూస్తుంటే ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోందని వేరేచెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఫిబ్రవరి 15న తాజా షెడ్యూల్‌ని ఫిక్స్ చేశారు. ఈ మూవీ సతీష్ నీనాసం కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవబోతోందని టీం ఎంతో నమ్మకంగా ఉంది. సతీష్ కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ ప్రయోగం అని మేకర్స్ చెబుతున్నారు.