ఆరోగ్యంగా తిందాం…

Let's eat healthy...పీచు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కూడా రకరకాలు ఉండొచ్చు గానీ ప్రధానమైనవి నీటిలో కరిగేది, నీటిలో కరగనిది. ఫైబర్స్‌ గట్‌ మైక్రోబయోటాను మీడియేట్‌ చేస్తుంది, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజువారీ తగిన మోతాదులో ఫైబర్‌ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్‌ రిచ్‌ డైట్‌ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. ఫైబర్‌ రిచ్‌ డైట్‌ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
తణధాన్యాలు తీసుకోండి..
అనారోగ్యకరమైన పాస్తా, వైట్‌ బ్రెడ్‌ వంటి ప్రాసెస్‌ చేసిన ధాన్యాలకు బదులుగా తృణధాన్యాలు తీసుకుంటే మన శరీరానికి కావలసినంత ఫైబర్‌ అందుతుంది. బ్రౌన్‌ రైస్‌, కినోవా, హౌల్‌ వీట్‌ పాస్తా, ఓట్‌ వంటి తణధాన్యాల్లో ఫైబర్‌ సమద్ధిగా ఉంటుంది. ఇవి మనకు ఎక్కువ సేపు ఆకలి కూడా వేయకుండా కడుపు నిండుగా ఉండటమే కాకుండా మీ జీర్ణక్రియ సున్నితంగా చేయడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి కూడా తృణధాన్యాలు సహాయపడతాయి.
పండ్లు, కూరగాయలు..
తాజా పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్‌ వంటి ముఖ్యమైన పోషకాలతో పాటు.. ఫైబర్‌ సమద్ధిగా ఉంటుంది. మీ డైట్‌లో రకరకాల పండ్లు చేర్చుకుండి. హెల్తీ సలాడ్స్‌, చాట్స్‌ తయారు చేసుకుని ఎంజారు చేయండి. మీరు ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా పండ్లు, కూరగాయలతో కూడిన భోజనం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. యాపిల్స్‌, నారింజ, బెర్రీలు, క్యారెట్లు, ఆకుకూరలు, బ్రకోలీలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది.
నట్స్‌..
నట్స్‌, విత్తనాలు వంటి స్నాక్స్‌ తీసుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వండి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మాత్రమే కాకుండా ప్రొటీన్‌, ఫైబర్‌ కూడా అధికంగా ఉంటాయి. వాల్‌నట్‌, బాదం, చియా గింజలు, పిస్తాపప్పులు, అవిసె గింజలు, గుమ్మడి గింజల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. వీటిని రోజూ ఆహారంలో చేర్చుకోవడానికి ప్రయత్నించండి.
పప్పు ధాన్యాలు..
చిక్కుళ్లు, కాయధాన్యాలు, పప్పు వంటి ఆహారాల్లో ఫైబర్‌ అధికం. ఇవి మన పొట్టను తేలికగా ఉంచుతాయి. సూప్‌లు, సలాడ్‌లు, ఆకుకూర పప్పు తయారు చేసుకుని తీసుకోవచ్చు.