నియోజక ప్రజలకు మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం సమగ్ర అభివృద్ధి కోసం, ఈ నూతన సంవత్సరంలో హామీలన్నీ అమలుచేసి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. సంక్రాంతి నుండి ప్రజలు నూతన ఆలోచనలతో కుటుంబ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో, బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరారు.