నవతెలంగాణ – మల్హర్ రావు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ఐటి పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీనుబాబు ఆదేశాలతో సోమవారం మండలంలోని అన్ సాన్ పల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ గుగులోతు జగన్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ అక్క చెల్లెళ్ళకు సంక్రాంతి కానుకగా ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ పోటిల్లో గెలుపొందిన మొదటి బహుమతి రూ. 2016 దారంసత్ అర్చన ,గుగులోత్ స్వాతి,రెండవ బహుమతి రూ.1016 సాధుల క్రిష్ణవేణి,మూడవ బహుమతి రూ.516 శీలవంతుల వర్ష లకు నగదు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నాగుల రమేష్, కొమురోజు రమేష్, పైడకుల తిరుపతి పాల్గొన్నారు.