‘నాగబంధం’ రహస్యం ఏమిటి?

What is the secret of 'Nagabandham'?పాన్‌-ఇండియా మూవీ ‘నాగబంధం’ నుంచి రుద్రగా హీరో విరాట్‌ కర్ణ ప్రీ-లుక్‌ ఇటీవల విడుదలై మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను హీరో రానా దగ్గుబాటి లాంచ్‌ చేశారు. ఈ యాక్షన్‌-ప్యాక్డ్‌ పోస్టర్‌లో విరాట్‌ కర్ణ పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘ది సీక్రెట్‌ ట్రెజర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. పద్మనాభ స్వామి, పూరీ జగన్నాథ్‌ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుండి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివత్తాలతో ఈ సినిమా ఉంటుంది. ఈ పవిత్ర స్థలాలను రక్షించే నాగబంధం పురాతన ఆచారాలపై దష్టి సారించి, భారతదేశంలోని విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా ప్రజెంట్‌ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. అభిషేక్‌ పిక్చర్స్‌తో కలిసి ఎన్‌ఐకె స్టూడియోస్‌ ఆధ్వర్యంలో కిషోర్‌ అన్నపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ ఐరా, దేవాన్ష్‌ నామా సమర్పిస్తున్నారు. నభా నటేష్‌, ఐశ్వర్య మీనన్‌, జగపతి బాబు, జయప్రకాష్‌, మురళీ శర్మ, బి.ఎస్‌.అవినాష్‌ కీలక పాత్రధారులు.