యువత మంచి కార్యక్రమాలలో భాగస్వాములు కావాలి..

– ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు
– తులేకలాన్ లో నాగటి భాస్కర్ స్మారక క్రీడోత్సవాలు ప్రారంభం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి : యువత చదువుతో పాటు సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలలో కూడా భాగస్వాములు కావాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు అన్నారు. ఇటీవల ఆకస్మికంగా మరణించిన ఉద్యోగ సంఘాల నాయకుడు నాగటి భాస్కర్ స్మారకార్థం తులేకలాన్ గ్రామంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలను  జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న అసమానతలు , సామాజిక రుగ్మతలను దూరం చేసేందుకు యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. దుర్వ్యసనాలకు దూరంగా యువత క్రమశిక్షణతో నైతికంగా ఎదగడానికి క్రీడలు దోహదం చేస్తాయని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించిన నాగటి భాస్కర్ ఉద్యోగ సంఘాల నేతగా ఈ ప్రాంతంలో విశేషమైన సేవలు అందించారని గుర్తుచేశారు. ప్రజలకు మెరుగైన సేవలందించినవారు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నాగటి నరేష్ , కళ్యాణ్ ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యాచారం సిఐ నర్సింహ్మారావు , ఎస్ఐ రామకృష్ణ , మండల బీఆర్ ఎస్ అధ్యక్షుడు బుగ్గరాములు , జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి , మాజీ ఎంపిటిసి నాగటి నాగమణి , మాజీ సర్పంచులు యాదగిరి , బీరప్ప  , ఉపసర్పంచ్ రాజిరెడ్డి , సొసైటీ వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి , ఉద్యోగ సంఘాల నాయకులు మారయ్య , మక్కపల్లి రాజు , అరుణ గిరి , శ్రవణ్ , చిలుకల సత్యం , హనుమండ్ల గణేష్ , కొర్వి శ్రీకాంత్ , యూత్ నాయకులు పంబలి నగేష్ , అంగద్ కుమార్ , గుజ్జ గిరి , దయ్యాల కిషన్ , నర్సింహ్మ , ఆంజనేయులు , బాష , వీరన్న , జనార్దన్ రెడ్డి , జగన్ యాదవ్ , అచ్చన జంగయ్య , రవి , శ్రీనివాస్ , జంగారెడ్డి , ప్రవీణ్ , మహేందర్ యాదవ్ , అచ్చన మహేష్ , గార్లపాటి శ్రీకాంత్ , బండ శ్రీనివాస్ , బండి పాండు , గణేశ , మౌనిక తదితరులు పాల్గొన్నారు.