నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని హన్మాపురం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పతంగుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల మల్లేష్ మాట్లాడుతూ యువత అన్ని రంగాలలో ముందుండాలని కోరారు. సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా యువకులకు పతంగులు పంపిణీ చేశామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు తోటకూర నాగరాజు, ముడుగుల రామ్ చందర్, దయ్యాల ప్రమోదు, తోటకూర రమేష్, ఉపేందర్, రాజు, దయ్యాల యశ్వంత్, నరసింహ రాకేష్ , జిట్టా శివ యువకులు పాల్గొన్నారు.