వ్యాక్సినేషన్ టీకాల గడువు చూసుకోవాలి

నవతెలంగాణ-భిక్కనూర్ : వ్యాక్సినేషన్ టీకాల గడువును ఎప్పటికప్పుడు చూసుకోవాలని హెచ్ఈఓ వెంకటరమణ ఆరోగ్య సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ లను పరిశీలించారు. రొటీన్ ఇమ్యునైజేషన్ ప్రక్రియ, టీకాలు, చిన్నారులకు అందిస్తున్న టీకాల వివరాలు, రికార్డులు పరిశీలించారు. అనంతరం చిన్నారుల ఆరోగ్య వివరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లులకు సూచించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు.