సంతానం కోసం..

For childrenవిక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, నిర్వి ఆర్ట్స్‌ బ్యానర్స్‌ పై మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మిస్తు న్నారు. సంజీవ్‌ రెడ్డి దర్శకుడు. షేక్‌ దావూద్‌జి ఈ సినిమాకు స్క్రీన్‌ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మకర సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ స్పెషల్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఓ కాంటెంపరరీ ఇష్యూని కథలో చూపిస్తూ వినోదాత్మకంగా రూపొంది స్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.