‘నారి నారి నడుమ మురారి’

'Nari Nari Naduma Murari'శర్వానంద్‌ నటిస్తున్న తన 37వ చిత్రం ‘సామజ వరగమన’ ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో చిత్రీకరణ జరుగుతోంది. అనిల్‌ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్‌ పై రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జారు ఫుల్‌ హిలేరియస్‌ రైడ్‌గా ఉండబోతోంది. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రానికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్‌ రివీల్‌ చేశారు. బాలకష్ణ, రామ్‌ చరణ్‌ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను లాంచ్‌ చేశారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ హీరో డైలామాని చూపిిస్తుంది. సాక్షి వైద్య, సంయుక్త మధ్య శర్వా గందరగోళ పరిస్థితిలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది.