నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంటల్ మండలంలోని సైదాబాద్ , విలాసాగర్ గ్రామపరిధిలో గురువారం వ్యవసాయ , రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి సాగుకు యోగ్యం కాని భూములు గుర్తించడం జరుతున్నదని మండల వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్ తెలిపారు . క్షేత్ర పరిశీలనలో గుర్తించిన సాగు కు యోగ్యంకాని భూములను 21 నుండి జరుగు గ్రామ సభలలో ప్రదర్శించి తీర్మానించడం జరుగుతoద ని తెలిపారు. మడిపల్లి, బిజిగిర్షరీఫ్, తనుగుల, వావిలాల గ్రామాలలో శుక్రవారం క్షేత్ర పరిశీలన జరుగుతుందని తెలిపారు. 16జమ్మికుంట పత్తి క్వింటాల్ కు గరిష్ట ధర రూ 7300 నవతెలంగాణ జమ్మికుంట జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు కాటన్ విడి పత్తి గురువారం 71 క్వింటాళ్లు ఏడు వాహనాలలో రైతులు విక్రయానికి తీసుకు వచ్చారు. గరిష్ట ధర 7,300, మోడల్ -6,850 ,కనిష్ట -6,500 పలికింది. కాటన్ బ్యాగ్స్ లలో మూడు క్వింటాళ్లు ఇద్దరు రైతులు విక్రయానికి తీసుకువచ్చారు. గరిష్టదర 6,800, మోడల్ -6,800, కనిష్ట- 6,400 పలికిందని మార్కెట్ సెక్రటరీ ఆర్ మల్లేశం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.