కార్యకర్తలు అధైర్యపడొద్దని, ఆపదలో వారికి అన్ని విధాల అండగా ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన బెల్లంకొండ శివకుమార్, బొమ్మెరబోయిన సోమన్న లు ఇటీవల వేరువేరు కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన గురువారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటానని భరోసా కల్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల ఉపాధ్యక్షుడు కనుకుంట్ల వెంకన్న, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షుడు పోలకొండ కృష్ణమూర్తి శర్మ, మండల సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, రాసాల సమ్మయ్య, బెల్లంకొండ సోమనర్సయ్య, కోట అశోక్, కమ్మగాని అశోక్, బొమ్మెరబోయిన కొమురయ్య తదితరులు ఉన్నారు.