ఆర్.ఎంపీ,పీ.ఎం.పి క్లినిక్ ల తనిఖీలు

నవతెలంగాణ-చందుర్తి : జిల్లా వైద్య శాఖ ఆదేశాల మేరకు గురువారం మాల్యాల,చందుర్తి, కిష్టం పేట,జోగాపూర్, రామన్నపేట, నర్సింగపూర్ గ్రామాలలో  పలు ఆర్.ఎం.పి,పి.ఎం. పి క్లినిక్ ల పై ఏక కాలం లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ  జిల్లా అధికారులు ఆదేశాల మేరకు లైసెన్స్ లేకుండా క్లినిక్ నిర్వహిస్తూ అదేవిదంగా మెడికల్ షాపుల కూడా నడుపుతున్న వారి ని గుర్తించి తనిఖీలు నిర్వహించడం జరిగిందని అన్నారు.ఆయన వెంట ఎస్సై ఆంజయ్య ఉన్నారు.