– ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లోకి కిరన్ జార్జి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో కిరణ్ జార్జి 22-20, 21-13తో అలెక్స్(ఫ్రాన్స్)ను వరుససెట్లలో చిత్తుచేశాడు. మరో పోటీలో 6వ సీడ్ నరోకా(జపాన్) 17-21, 15-21తో అనూహ్యంగా అన్‌సీడెడ్, సింగపూర్‌కు చెందిన యో-లెV్‌ా చేతిలో ఓటమిపాలయ్యాడు. మరో ప్రి క్వార్టర్ఫైనల్లో 3వ సీడ్, డెన్మార్క్ఉ చెందిన విక్టర్ అక్సెల్సన్ 21-11, 21-14తో జాన్సెన్(సింగపూర్)ను ఓడించాడు. ఇక పురుషుల డబుల్స్‌లో 7వ సీడ్ సాత్విక్-చిరాగ్ జంట 20-22, 21-14, 21-16తో జపాన్ జంటను ఓడించి క్వార్టర్స్‌కు చేరారు.
సింధు ముందుకు..
మహిళల సింగిల్స్‌లో పివి సింధు క్వార్టర్స్ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రి క్వార్టర్స్‌లో సింధు 21-15, 21-13తో మనామీ సుజు(జపాన్)ను ఓడించింది.
బ్యాటింగ్ కోచ్‌గా సీతాన్షు కోటక్
ఇంగ్లండ్‌తో తలపడే భారతజట్టుకు బ్యాటింగ్‌కు కోచ్‌గా సీతాన్షు కోటక్ ఎంపికయ్యాడు. భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) గురువారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టి20ల సిరీస్ జనవరి 22నుంచి ప్రారంభం కానుంది. ఇరుజట్ల మధ్య జరిగే తొలి టి20 ఈడెన్ గార్డెన్స్‌లో వచ్చే బుధవారం జరగనుంది. పురుషుల సీనియర్ జట్టులో అభిషేక్ నాయర్, ర్యాన్-టెన్-డోస్ఛేట్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు. కానీ బ్యాటింగ్ కోచ్‌లు ఎవరు లేరు. మోర్నీ మెర్కెల్, దిలీస్ బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు అలాగే కొనసాగున్నారు. ఇక గౌతం గంభీర్ ప్రధాన కోచ్‌గా, నాయర్ బ్యాటింగ్ కోచ్‌కు సహాయకులుగా కొనసాగనున్నారు. సౌరాష్ట్రకు చెందిన కోటక్ లిస్ట్-ఎ 130 మ్యాచుల్లో 8వేల పరుగులు చేశాడు. అందులో 15సెంచరీలు ఉన్నాయి.
క్వార్టర్‌ఫైనల్స్(సింగిల్స్)…
పురుషులు.. మహిళలు..
కిరణ్ జార్జి × హంగ్యాన్(చైనా) సే-యంగ్-అన్(కొరియా) × జియా-మిన్-యో(కజకిస్తాన్)
ఛౌ టిన్ చెస్(తైపీ) × ఛో-యు-లీ(హాంకాంగ్) పివి సింధు × మరిస్కా(ఇండోనేషియా)
కెన్-యు-హో(సింగపూర్) × అక్సెల్సన్(డెన్మార్క్) యు-హన్(చైనా) ×ఫంగ్-జియా(చైనా)
ఛున్-హి-లిన్(తైపీ) × జొనాథన్ క్రిస్టీ(ఇండోనేషియా) మియాజాకి(జపాన్) × జి-హి-వాంగ్(చైనా).